1 April, 2026 | 1:53 AM

హనుమాన్ జయంతి వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

01-04-2026 12:24 AM

ర్యాలీ మార్గాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర 

కామారెడ్డి, మార్చి 31 (విజయక్రాంతి): హనుమాన్ జయంతి వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని స్వయంగా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి, రూట్ మ్యాప్ పరిశీలించారు.

ఏప్రిల్ 02న హనుమాన్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న హనుమాన్  శోభాయాత్ర సాగే మార్గాలను, ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్,  జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు. ర్యాలీ సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించి పలు కీలక సూచనలు చేశారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ర్యాలీ సాగే రూట్ మ్యాప్ను పరిశీలించారు. ప్రధాన కూడళ్లను సందర్శించి ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు.

అనంతరం ర్యాలీ నిర్వహణ ప్రతినిధులతో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు, హనుమాన్ జయంతి వేడుకలను క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ముఖ్య మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు , సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుందని వారు తెలిపారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా భక్తులు, నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి ఈ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎస్.హెచ్.ఓ నరహరి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ ,  ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.