13 April, 2026 | 1:27 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి

13-04-2026 11:43 AM

బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి 

కూసుమంచి, (విజయ క్రాంతి): మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి తహసీల్దార్ ను కోరారు.  సోమవారం  కూసుమంచి మండల ఎమ్మార్వో  గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన  సందర్భంగా తహసీల్దార్ డి సైదులు ని మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన్ని సన్మానించారు.

ఈ సందర్భంగా కూసుమంచి మండల ప్రజలు, ముఖ్యంగా రైతులు  వివిధ పనులు నిమిత్తం కార్యాలయము వద్దకు వచ్చినప్పుడు హెల్ప్ డెస్క్ ద్వారా వారి సమస్యలు కనుగొని సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని కోరారు. అలాగే  మండల కేంద్రంలో ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కావున సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, బోనస్ చెల్లించాలి అని విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పిట్టల వేణు గుండా విజయ్ పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు