13 April, 2026 | 3:44 PM

నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రికార్డు ప్రగతి

13-04-2026 02:03 PM

నిరంతరాయంగా 1.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

నంగునూరు,(విజయక్రాంతి): సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ(Narmetta Oil Palm Factory) ఉత్పత్తిలో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది.ఇటీవల సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన ఫ్యాక్టరీ 22 రోజుల వ్యవధిలోనే మొత్తం 5,420 మెట్రిక్ టన్నుల ఎఫ్.ఎఫ్.బి ప్రాసెసింగ్‌ను పూర్తి చేసింది.గరిష్ట సామర్థ్యమైన రోజుకు 600 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్‌ను సాధించడం విశేషం.కేవలం ప్రాసెసింగ్ మాత్రమే కాకుండా, ఫ్యాక్టరీలో 1.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా సమర్థవంతంగా కొనసాగుతోంది.సిబ్బంది సమన్వయం,అంకితభావం వల్లే ఈ అద్భుతమైన పురోగతి సాధ్యమైందని యాజమాన్యం ప్రకటించింది.