13 April, 2026 | 5:16 AM

ఇంటర్ ఫలితాల్లో ‘సివి రామన్’ విజయపరంపర

13-04-2026 03:31 AM

విద్యార్థులను అభినందించిన కళాశాల యాజమాన్యం 

వనపర్తి, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): 900లకు పైగా మార్కులను 133 మంది విద్యార్థులు, 400లకు పైగా మార్కులను 131 మంది విద్యార్థులు సాధించడం జిల్లా రికార్డ్ అని వనపర్తి జిల్లా కేంద్రంలోని సివి రామన్ జూనియర్ కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. తమ కళాశాల విద్యార్థులు విజయపరంపరను కొనసాగించాలని సంతోషం వ్యక్తం చేశారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించ డం సివి రామన్‌కే సాధ్యమైందన్నారు.

ఆదివారం వెలువడిన ప్రథమ, ద్వితీయ సంవ త్సర ఫలితాల్లో విద్యార్థులు అత్యున్నత ఫలితాలను సాధించినందుకు వారి తల్లితండ్రు లకు, అందుకు కృషి చేసిన అధ్యాపక బృం దానికి యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది. విద్యార్థులను కళాశాల యాజమా న్యం పూలబోకెలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో కశాళాల కరస్పాండెంట్  డాక్టర్ వీరయ్య, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, కుమారస్వామి, ప్రిన్సిపాల్ జిఎస్‌ఎస్. ప్రకాశ్, సీనియర్ అధ్యాపకులు యస్. వెంకటరమణ, జమీర్ ఖాన్, మల్లిఖార్జున్ పాల్గొన్నారు. 

ర్యాంకులు సాధించిన విద్యార్థులు.. 

ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో వి. మేఘన 993, కె. అక్షయ, 992 హన్సిక, 992 సానియా, 992 స్వాతి, 991 శ్రావణి, బైపీసీ విభాగంలో లక్ష్మి నారాయణ 991, సూర్య వర్షిణి 986, జి. మధుమోహన్ రెడ్డ్డి, జి. కావ్య 979, ఎంఈసి విభాగంలో వి. నందిని 983, సి. జానేశ్వరి 967, సిఈసి విభాగంలో ఆర్. వైష్ణవి 884, రామాంజనేయులు 828,

మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో కె. నవ్యసుధ 468, ఎ. కావ్య 468, మనస్విని 467, జయసూర్య 467, నరసింహ 467, సుమన్ 467, శ్రావణి 466, అక్షయ 465, బైపీసీ విభాగంలో ము రళి కృష్ణ 433, అభిలాష్ 427, హారిక 423, ఎంఈసి విభాగంలో రాకేష్ నాయుడు 489, గురుప్రసాద్ 475, సిఈసి విభాగం లో కె. శివకుమార్ 479, కె. అనిల్ 475, బోజేష్ 466 మార్కులను సాధించారు.