30 May, 2026 | 11:24 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

రెజోనెన్స్ అద్భుతమైన ఫలితాలు

13-04-2026 03:38 AM

విద్యార్థులను అభినందించిన చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి

కరీంనగర్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం కలిసొచ్చినప్పుడు అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయనేందుకు నిదర్శనమని కరీంనగర్‌లోని కోట ఇన్‌స్టిట్యూట్ రెజోనెన్స్ జూనియర్ కళాశాల చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి అన్నారు. రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ర్యాంకులు సాధించడం తెలంగాణతోపాటు కరీంనగర్ జిల్లాకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత ఫలితాలు సాధిం చేందుకు రెజోనెన్స్ కళాశాల కృషి చేస్తుందన్నారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థు లకు, తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక అభినంద నలు తెలిపారు. 

ర్యాంకులు..

ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470కి గాను గాలి సౌమ్యశ్రీ 469 మార్కు లు సాధించి రాష్ట్ర ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. అదే విభాగంలో ఎస్.సాత్విక్, వేముల అఖిల, కె. శ్రీ సహస్రరెడ్డిలు 468 మార్కులు సాధించి అగ్రశ్రేణిలో నిలిచారు. 11 మంది విద్యార్థులు 467 మార్కులు, 17 మంది 466 మార్కులు సాధించగా, 465 పైన 42 మంది, 460పైన 110 మంది  ప్రతిభ కనబరిచారు. జూనియర్ బైపీసీ విభాగంలో 438 మార్కులతో పి. శర ణ్య రాష్ట్రంలో ప్రథమస్థానం. ఎం. సిద్ధి 437, ఈ విభాగంలో 430పైన 18 మంది విద్యార్థులు మార్కులు సాధించారు.

ద్వితీయ సం వత్సరం ఎంపీసీ విభాగంలో కే. సహనసిరి 995 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 980పైన 46 మంది విద్యార్థులు మార్కులు సాధించడం విశేషం. బైపీసీ విభాగంలో జి.రోషిని 993, ఎం. శ్రీష 992 మా ర్కులు సాధించి ప్రతిభచాటారు. 90 శాతంపైగా ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో ప్ర భంజనం సృష్టించారు. సబ్జెక్టుల వారీగా 100శాతం మార్కులు సాధించారు. ఇంగ్లీష్‌లో ముగ్గురు, గణితం ఎలో 100మంది, గణితం బిలో 156 మంది, ఫిజిక్స్ 425,  కెమిస్ట్రీలో 355, బాటనీలో 41, జువాలజీలో 40 మంది విద్యార్థులు పూర్తి మార్కులు సాధించారు.