7 July, 2026 | 7:33 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

ఏఐసీసీ కార్యదర్శులకు వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ల బాధ్యతలు

31-08-2024 01:20 AM

తెలంగాణకు విష్ణునాథ్, విశ్వనాథ్

ఏపీకి గణేశ్ కుమార్ యాదవ్, పలక్ వర్మ  

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): వివిధ రాష్ట్రాలకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శులను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌ఘడ్, తమిళనాడు, పుదుచ్చేరికి ఏఐసీసీ కార్యదర్శులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది, ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణకు ఏఐసీసీ కార్యదర్శులుగా విష్ణునాథ్, విశ్వనాథ్‌లను నియమించగా, ఏపీకి గణేశ్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీగా పలక్ వర్మను నియమిం చారు. ఇక  తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌కు ఛత్తీస్‌ఘడ్ ఇన్‌చార్జ్ కార్యదర్శిగా, తమిళనాడు పుదుచ్చేరి కార్యదర్శిగా సూ రజ్ హెగ్గేకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. గుజరాత్‌కు ఏఐసీసీ సెక్రటరీగా తెలుగు నేత ఉషానాయుడు, జార్ఖండ్‌కు సిరివెల్ల ప్రసాద్‌ను నియమించారు.