calender_icon.png 13 September, 2024 | 1:47 AM

రేవంత్ బాబా 11 మంది దొంగలు

14-07-2024 12:49:13 AM

  1. దొంగల పాలన పోయి.. గజదొంగల పాలన వచ్చింది
  2. రాష్ట్రంలో బీఆర్‌యూ ట్యాక్స్
  3. బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ అవినీతిని నిలదీస్తాం
  4. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, జులై 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో రేవంత్ బాబా 11 మంది దొంగల పాలన సాగుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో దొంగల పాలన పోయి గజదొంగల పాలన వచ్చిందని దుయ్యబట్టారు. అసెంబ్లీ మీడి యా పాయింట్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డితోపాటు ఆయన 11 మంది మంత్రులు అవినీతికి బాటలు వేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర అమృత్ నిధులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం వెంటనే అవినీతి టెండర్లు రద్దు చేసి, గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్‌చేశారు.

టెండర్లను రద్దు చేస్తే రూ.1,200 కోట్లు ఖజానాకి మిగులుతుందన్నారు. టెండర్లు రద్దు చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృ తం చేస్తామని హెచ్చరించారు. రేవంత్‌ప్రతిపక్షంలో ఉండగా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారె డ్డిని జైలుకు పంపిస్తామన్నారని గుర్తుచేశారు. సీఎం అయ్యాక మళ్లీ అదే మేఘా కృష్ణారెడ్డికి 40 శాతం ఎక్కువ టెండర్లు ఎ లా ఇచ్చారని ప్ర శ్నించారు. ఇవే గ్లోబల్ టెండర్లు పెడితే 30 శాతం తక్కువకు చేసేందుకు ఎన్నో కంపెనీలు ముందుకు వస్తా యన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తే, వాటిని కూడా గ్లోబల్ టెండర్ల ద్వారానే కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచించారు. ప్రజలకు తెలియకుండా దొంగ జీవోలు జారీ చేయడం రేవంత్‌రెడ్డికి సమంజసం కాదన్నారు. జవాబుదారీతనం, పారదర్శకత లేని పాలనను ప్రజలు ఉపేక్షించరన్నారు.

బీఆర్‌యూ (భట్టి, రేవంత్, ఉత్తమ్) ట్యాక్స్‌తో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోతుందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పనులన్నీ ఏపీకి చెందిన కాం ట్రాక్టర్లకు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. గతంలో రేవంత్ తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా అంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని గుర్తుచేవారు. చీకటి జీవోలు, చీకటి ఒప్పం దాలతో సీఎం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ర్ట ప్రభుత్వం ఎక్కడ చూసినా చీకటి ఒప్పందాలతో అవినీతిమయమైందని ఆరోపించారు. సీఎం ప్రజాద ర్బార్ సైతం నిర్వహించడం లేదని మండిపడ్డారు. ప్రజాపాలన పేరుపై రాక్షస పాలన నడుస్తోందన్నారు. కవిత లిక్కర్ కేసులో సీఎం బావమరిది శృజన్ లేరా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల అవినీతిపై ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు.