05-02-2026 12:00:00 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం రోజున యూనివర్సిటీ సెమినార్ హల్ లో ‘భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు యొక్క ప్రభావం ‘అనే అంశంపై రెండు రోజుల జాతీయస్థాయి సదస్సు అట్టహసంగా ప్రారంభమైనది.
జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రొ.సతీష్ కుమార్, రిజిస్టార్ , శాతవాహన విశ్వవిద్యాలయం, సదస్సు కిలకోపన్యాసలు ప్రొఫెసర్ చిట్టేడి కృష్ణారెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, వి. సి. ఓ ఎస్ డి డాక్టర్. డి హరికాంత్, ఆరట్స్ అండ్ లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. కె. పద్మావతి వంటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా సదస్సు యొక్క అంతర్జాతీయ జర్నల్ ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసి సదస్సుకు అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ రిజిస్టార్ ప్రొ ఫెసర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్ రంగంలో కృత్తిమ మే ధస్సు విరివిగా ఉపయోగిస్తున్నారని, శాస్త్ర సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు టూల్స్ ను ఉపయోగించి ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటును సాధించవచ్చు అని వివరించారు. తదుపరి డాక్టర్ డి హరికాంత్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ రంగాలలో మొబైల్ వాడకం, ఆర్థిక చెల్లింపులు మొదలగు కార్యక్రమాలలో కృత్రిమ మేధస్సు ప్రభావం మెండుగా ఉందన్నారు.
కీలక ఉపన్యాస వక్తగా విచ్చేసిన ప్రొ. చిట్టేడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మన నిత్య జీవితంలో సమాచా ర విశ్లేషణ, సేకరణ వంటి కార్యక్రమాలలో కృత్రిమ మేధస్సు యొక్క ప్రభావం ఉందని, పారిశ్రామిక సేవా రంగాలలో కృత్రిమ మేధస్సు ముందంజలో ఉందని ఇంకా వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించడంలో ఎన్నో మార్పులు రావాలని, కృత్రిమ మేధస్సును ఉపయోగించి ముఖ్యంగా తయారీ రంగము మరియు ఉత్పత్తి రంగంలో పెరుగుదలను సాధిస్తున్నామని దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును పెంచడానికి అవకాశం ఉందని గణంకాలను వివరించారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ కే. పద్మావతి మాట్లాడుతూ మన రోజువారి జీవితంలో కృతమ మేధస్సు యొక్క ఉపయోగం ఎంతో ఉందని వివరించారు. సెమినార్ కన్వీనర్ మరియు అర్థశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్. కే శ్రీవాణి మాట్లాడుతూ విద్య, వైద్య మరియు వ్యా పార రంగాలలో కృత్రిమ మేధస్సును విరివిరిగా ఉపయోగిస్తున్నారని దీని ద్వారా మంచి ఫలితాలను కూడా సాధించడం జరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొ. ఏం. వరప్రసాద్, ప్రొ.సూరేపల్లి సుజాత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్. మహ్మద్ అబ్రహం బాకీ, డాక్టర్ జాఫర్ జరీ,డాక్టర్. ఉమేరా తస్లీమ్, డాక్టర్. మునావర్, డాక్టర్ విజయ్ ప్రకాష్, డాక్టర్. డి.సత్యనారాయణ, డాక్టర్. విద్యాసాగర్,అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.