15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కాంగ్రెస్ బెదిరింపులు ఆపాలి

05-02-2026 12:00 AM
  1. మున్సిపాలిటీ ఎన్నికల్లో  బిఆర్‌ఎస్ దే విజయం

మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

చండూరు, ఫిబ్రవరి 4: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న మునుగోడు నియోజకవర్గలో చండూరు మున్సిపాలిటి అభివృద్ధి శూన్యం అని మునుగోడు మాజీ శాసనసభ్యులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.బుధవారం ఆయన చండూరు మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సర్వే రిపోర్టులు  అన్ని బిఆర్‌ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని,

అందుకే రెండు ఎక్స ఆఫీసీయో ఓట్లు చండూరులో పెట్టుకున్నారని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అభ్యర్థులను ప్రచారం చేయకుండా బెదిరింపులకు గురిచేస్తున్నారని,ఇలాంటి  చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే రాని మంత్రి పదవి కోసం అదే పదే పాపులాడుతున్నారని ఎద్దేవా చేశారు.

నేను మంజూరు చేయించిన నిధులల్లో ఇంకా 6 కోట్లు రూపాయలు ఎమ్మెల్యే ఖర్చు చేయలేకపోతున్నారని, ఆయనకు అవగాహన రహితం వల్ల చండూరులోని డబల్ రోడ్డు అస్తవ్యస్తంగా తయారయిందని, ఒకసారి అధికారులతో రివ్యూ పెడితే పనులన్నీ పూర్తి అయితాయని కానీ దానిపై దృష్టి పెట్టడం లేదన్నారు. భజనపరులను వెంబటేసుకొని ఆయన భజన కే తప్ప మునుగోడు అభివృద్ధిపై ఆయనకు ధ్యాస లేదని, చేతగాని ఎమ్మెల్యేను గెలిపించుకున్నామని చండూరు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.

గతంలో మేము పనులు చేసుకుంటూ పొతే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.ఎన్నికల్లో ఓడిపోతున్నామని కాంగ్రెస్ పైసలను  నమ్ముకుందని మేము మాత్రం ప్రజలను నమ్ముకున్నామని అన్నారు . ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ను ఓడించి బిఆర్‌ఎస్ కౌన్సిలర్లను గెలిపించాలని కోరారు.

అనంతరం మున్సిపాలిటీ లేని ఒకటో వార్డు, మూడో వార్డు లో వివిధ పార్టీల 60 మంది నాయకులు కార్యకర్తలు బిఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్, బొడ్డు సతీష్ గౌడ్, గోపిడి వెంకట్  రెడ్డి, చొప్పరి దశరథ,సామ యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.