వరద ప్రభావంతో వరి పొలాలు నాశనం
- అన్నదాతకు హరిగోశ, వరుస వర్షాలతో అన్నదాతకు తీరని నష్టం.
- భారీ వరదల కారణంగా వాగుల ప్రవాహంతో పొలాల్లో ఇసుక మేటలు కుళ్లిపోతున్న వరి నారు
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 2 : గత నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలు తీవ్ర నష్టాన్ని ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ అడవి లింగాల పలు గ్రామాలలో చెరువు కట్టలు తెగి కళ్యాణి వాగు లో చేరడంతో వాగుకు వచ్చిన వరద రైతులను కన్నీటి పర్యాంతం చేసింది. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగి వరి నారు కుళ్ళిపోగా, వరి పంట పొలాలలో ఇసుక మేటలు వేసి పెద్ద పెద్ద గుండ్లు , ఏర్పడి వ్యవసాయ భూములు పనికిరాకుండా పోయాయి.
కళ్ళముందే పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేయడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు అయినా అడవి లింగా ల , కళ్యాణి, తిమ్మారెడ్డి ,ఆజామాబాద్ , అన్నాసాగర్ గ్రామాల పరిధి రైతుల వందలాది ఎకరాలు ఎక్కువ శాతం వారి పంటలు నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా కళ్యాణి ప్రాజెక్ట్ గేట్లు అధికారులు ముందస్తుగా ఎత్తకపోవడం వల్ల భారీ వరద ఉద్రిక్తతతో ప్రాజెక్టు కట్ట ఇరువైపులా తెగి ప్రాజెక్టు కింది పంటల మీదుగా భారీ వరద వెళ్లడంతో వందల ఎకరాల వరి పంటలలో ఇసుక, మట్టి, చెట్ల కొమ్మలు కొట్టుకు వచ్చి చేరడంతో పంటలు కోలుకోకుండా పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి.
అధికారులు ముందస్తుగా కళ్యాణి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తే భారీ పంట నష్టం కాకుండా ఉండేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డి మండలాల్లో భారీ వరదలకు నీట మునిగిన పంట పొలాలు కులిపోతున్న వరి నారులు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం మాల్ తుమ్మెద చినూర్ వాడి లింగంపల్లి తాండూర్ వెంకంపల్లి మాటూర్ మాసంపల్లి మతమాల్ రుద్రారం ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో వరద ముంపుకు పంట పొలాలు కుళ్ళిపోయి రైతులకు తీరని బాధ ముంపేదిరింది.
పొలాల్లో ఇసుక మేట లు, మట్టి దిబ్బలు. వరద ఉధృతి తగ్గిన తర్వాత రైతులు అసలు నష్టం కళ్ళకు కనిపిస్తున్నాయి. అయితే లోతట్టు ప్రాంతాలలో ఉన్న వ్యవసాయ పొలాల్లో వరద నీరు చేరి ఇసుక మేటలు వేసింది, కొన్నిచోట్ల ఒకటి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఇసుక పేరుకుపోవడంతో వరి పొలాలు కనిపించకుండా సాగుకు పనికి రాకుండా పోయా యి. మరికొన్నిచోట్ల వరినీటిలో మునిగి కుళ్లిపో యింది. సుమారు వేల ఎకరాలకు పైగా వరి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.
కళ్యాణి వాగు ఉధృత వరదల వల్ల పంటలు నీట మునిగి పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వాగు ఉద్రిక్తత ప్రవాహం భారీగా రావడంతో కళ్యాణి గ్రామంలో లోతట్టు ప్రాంతాలో ఉన్న పలు నివాసాలలోకి నీళ్లు చేరి కొన్ని నివాసాలు దెబ్బతిన్నాయి. ప్రభు త్వం పంట ఆస్తి నష్టం పరిహారం అందించి ఆదుకోవాలని ప్రజలు రైతులు కోరుతున్నారు.
పంట నష్టపరిహారం అందించాలని కోరుతున్నాం..
గత నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహించడంతో కళ్యాణి ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారులు సమయానికి ప్రాజెక్టు గేట్లు ఎత్తకపోవడంతో ప్రాజెక్టు కట్ట తెగి అన్నాసాగర్ గ్రామ శివారులోని వరి పంటలలో నుండి భారీ వరద ప్ర వహించడంతో వరి పంట పొలాలలోకి ఇసుక మట్టి రాళ్లు కొట్టుకు వచ్చి పంట పూర్తిగా దెబ్బతిన్నది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడం లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలని కోరు తున్నాం.
-పెరుగు నాగరాజు, మాజీ సర్పంచ్ అన్నాసాగర్






