02-12-2025 02:21:50 AM
-మీడియా పేరిట వసూళ్లు
-ఏటా రూ.కోటికి పైగా..
-20 ఏళ్లుగా ఓ విలేకరి తిష్ట
నిజామాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లాలోని జాతీయ, రాష్ట్ర.. వేర్ హౌస్ గోడౌన్లతోపాటు మిల్లర్స్ అసోసియేషన్ లో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి.
ఇందుకు కారణం గత 20 సంవత్సరాలుగా తిష్ట వేసిన అధికారులు, వారితోపాటు అసోసియేషన్ పేరా జిల్లాలోని మిల్లర్ల నుండి అక్రమంగా డబ్బుల వసూళ్లు చేస్తూ ప్రభుత్వ అధికారుల చేతులు తడపడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తమవైపు చూడకుండా ఉండడాని కంటూ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విషయం జిల్లా రైస్ మిల్ వ్యాపారులు అందరికీ తెలిసిందే, నిజామాబాద్ ఒక్క జిల్లాలో పిడిఎస్ బియ్యం వ్యాపారం లో ఆరితేరిన కోటగిరి కి చెందిన ఇద్దరి తోపాటు మరొక వ్యక్తి జర్నలిస్టుల వాటా పేరుతో కూడా వసూళ్లకు పాల్పడినట్టు విశ్వాసనీయ సమాచారం.
కొందరు బడా మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి సెంట్రల్ వేర్ హౌస్ స్టేట్ వేర్ హౌస్ గోడౌన్ల తో పాటు ప్రైవేట్ గోడౌన్ల లో అక్రమ వసూళ్లకు పాల్పడు తున్నారంటే అవుననే సమాధానం వస్తోంది. హ్యాండ్లింగ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పేరా అదనంగా వసూళ్లకు పాల్పడుతూ తాము చేస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా జరగాలంటే జర్నలిస్టులకు కూడా డబ్బులు ఇవ్వాలని నిజామాబాద్ జిల్లాలో వేళ్లపైన లెక్కపెట్టే కొందరు జర్నలిస్టుల పేరా డబ్బులు పెద్ద ఎత్తున వసూలు చేసినట్టు అత్యంత విశ్వాసనీయ సమాచారం.
గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులకు నాయకత్వం వహిస్తున్నా అంటూ పిడిఎస్ బియ్యం అక్రమ వ్యాపారూలు మొరం వ్యాపారులు ఇసుక వ్యాపారుల నుండి అడ్డగోలుగా సంపాదిస్తూ కొందరు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లను తన వెంట తిప్పుకుంటున్న ఒక ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు పేరు కర్ణ బైరీ అదిరిపోయేట్టుగా బహిరంగంగా వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో పిడిఎస్ అక్రమ బియ్యం వ్యాపారులకు ప్రముఖ టీవీ ఛానల్ (5 ) రిపోర్టర్ తనతో పాటు మరో అయిదుగురు అంటూ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఆరుగురు జాబితా తో పాటు ప్రింట్ మీడియా జాబితాను కూడా ఇచ్చి లక్షల్లో దండు కుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ తతంగం గత కొన్ని సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఒకరిద్దరు మిల్లర్లు అసలే నష్టాల్లో ఉన్నాం ఇచ్చేదేమి లేదంటూ ఎదురు తిరగడంతో ఈ విషయం బట్టబయలు అయింది. ఈ డబ్బుతో సదరు జర్నలిస్టు రియల్ ఎస్టేట్ స్థిరాస్తి వ్యాపారాలు మొదలుపెట్టాడు. ఈ అక్రమ పిడిఎస్ రైస్ వ్యాపారులకు రక్షణ కవచంలా మారిన ఈ విలేకరి బృందం జిల్లాలో సుమారు గా ఉన్న ‘రా‘ రైస్ 220 మిల్లుల నుండి 20 వేల రూపాయల చొప్పున నియోజక వర్గా లవారీగా వసూలు చేసినట్టుగా రైస్ మిల్ వర్గాల్లో చర్చనీ అంశమైంది.
ఈ బృందం ఇదే పిడిఎస్ వ్యాపారుల మద్దతుతో విదేశాలలో విలాసవంతంగా విహారానికి వెళ్లి తిరిగి వచ్చారు. 220 వరకు ఉన్న రా రైస్ మిల్లుల నుండి అక్షరాల 44 లక్షల రూపాయల 20వేల చొప్పున వసూలు చేయగా. బాయిల్ రైస్ 80 మిల్లుల నుండి 30 వేల రూపాయల చొప్పున సుమారుగా 24 లక్షల రూపాయలు ఒక్క సీజన్లో వసూళ్లకు పాల్పడ్డారు.
24 లక్షల రూపాయలు 44 లక్షల రూపాయలు కలిపి 68 లక్షల రూపాయలు ఒక్క ఖరీఫ్ సీజన్ కు వసూళ్లకు పాల్పడగా రబీకి అదే క్రమంలో 68 లక్షల రూపాయలు అంటే సంవత్సరంలోని రెండు సీజన్ల అయిన రబీ ఖరీఫ్ కు కలిపి రెండు సీజన్లకు గాను సంవత్సరానికి 1 కోటి 36 లక్షల రూపాయల బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు.
వీరికి పిడిఎస్ అక్రమ బియ్యం వ్యాపారుల సహకారం పూర్తిగా అందు తోంది. నిజామాబాదు లో వరి పంటలు ఎక్కువగా పండాయి. ముఖ్యంగా ముగ్గురు బడా వ్యాపారులు పిడిఎస్ బియ్యం రాష్ట్రం నలుమూలల నుండి సేకరించి తమ అక్రమ బియ్యం వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. దేశ విదేశాలకు పిడిఎస్ బియ్యాన్ని నైస్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంది యజమాన్యాల నుంచి మాకు ఒత్తిడి ఉంది మేము వార్తలు పెట్టాలి.
యజమాన్యాలకు సంవత్సరపు యాడ్స్ తాలూకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది మీ వ్యాపారం సజావుగా సాగాలంటే మాకు డబ్బు లు ఇవ్వక తప్పదు అని బేరం పెట్టగా ఒక్క ‘రా‘ రైస్ మిల్లుకు 20.వేల రూపాయలు ఒక బాయిల్ రైస్ మిల్లు కు సంబంధించి 30 వేల రూపాయలకు బేరం కుదుర్చుకుంది ఈ టీం. ఇంకేముంది ఈ వ్యాపారం సాగించే అక్రమ వ్యాపారులు విలేకరులకు డబ్బు సంపాదించి పెట్టే ఈ అక్రమ కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసు కొని మిల్లర్ల కు విజిలెన్స్ దాడుల బూచి చూపి ముక్కు పిండి వసూళ్లకు పాల్పడ్డారూ వసూలైన డబ్బుని ఈ ఉత్తమ జర్నలిస్టు చేతికి పంపిణీ కై సీజన్లవారీగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా.
ఏమాత్రం చెమటోడ్చి కష్టపడకుండా అక్రమ ంగా వసూలు చేసిన డబ్బు తమ చేతుల్లోకి వచ్చి చేరుతుండ డంతో ఈ మీడియా సిండికేట్ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. ఈ వ్యవహారంలో కొందరు అధికారులకు కూడా వాటా ఉన్నట్టు స్పష్టమైన సమాచారం ఉంది.
ఈ వసూళ్ళు సంవత్సరానికి ఖరీఫ్ రబీ కలిపి రెండు సీజన్ ల వసూళ్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ వస్తువుల పర్వానికి ఇటీవలే కొందరు మిల్లర్లు తిరగబడి డబ్బులు చెల్లించడం తమ వల్ల కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం.