calender_icon.png 2 December, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కొత్త’గా ఎన్ని‘కళ’లో..!

02-12-2025 02:11:47 AM

  1. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 35 పంచాయతీలకు తొలి ఎన్నికలు

తండాల్లో పండుగ వాతావరణం

బరిలో నిలిచేందుకు యువత ఆసక్తి

కొత్త పంచాయతీల్లో పట్టుకోసం పార్టీల సిగపాట్లు

సంగారెడ్డి, డిసెంబర్ 1(విజయక్రాంతి):కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు కార ణం. సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా పోటీ చేసే అవకాశం రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మెదక్ జిల్లాల్లో 24 గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఇందులో తండాలు కూడా ఉన్నాయి. ఇందులో సర్పంచ్ స్థానాలు రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ అయ్యాయి.

మొదటి సారి సర్ప ంచ్ గా, వార్డు మెంబర్ గా ఎన్నిక అయ్యేందుకు చాలా మంది యువకులు ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సర్పంచ్ గా మొదటిసారి ఎన్నికైతే తమ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా ఎన్నికల పైనే చర్చించు కుంటున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో 11 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇందులో 7 గిరిజన తండాలు ఉన్నాయి. 

ఎన్నికల క్షేత్రంలోకి యువకులు..

మొదటి సారిగా కొత్తగా పంచాయతీగా మారిన గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి జరుగుతుండటంతో యువకులు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునే పడిలో పడ్డారు. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్లను ఏకగ్రీవం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పరాయి పంచాయతీ పాలనలో తండాలు అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు.

ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ముందుగా ఆ గ్రామానికి వెచ్చించిన తర్వాతే తండాలకు కేటాయించే వారని, దీంతో అభివృద్ధిలో వెనుకబడి పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాలు గ్రామ పంచాయతీలుగా మారడంతో తమ గ్రామాలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని సం తోషం వ్యక్తం చేస్తున్నారు. 

కొత్త పంచాయతీలపై పార్టీల దృష్టి...

సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు చాలా వరకు తం డాలు ఉన్నాయి. అయితే తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నందున ఈ పంచాయతీల్లో ప్రధాన పార్టీలు తమ ప్రభావం చూపించడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. కొత్త పం చాయతీల్లో నిలబడే అభ్యర్థులకు తమ మద్దతు అంటే తమ మద్దతు అంటూ ఉత్సా హం కల్పిస్తున్నారు. ఎలాగైనా తమ మద్దతుదారులను ఎంపిక చేసి గెలిపించుకోవాలని చూస్తున్నాయి. అయితే తమ తండాలను అభివృద్ధి చేసుకోవాలంటే నిధులు అవసరమని, నిధులను తెచ్చి అభివృద్ధి చేసే వ్యక్తినే గెలిపించుకోవాలని భావిస్తున్నట్లుతెలుస్తోంది.