calender_icon.png 2 December, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1.76 లక్షల మందికి దర్శన భాగ్యం

02-12-2025 08:15:14 AM

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం నాడు తిరుమల శ్రీవారి వైకుంఠద్వార(Tirumala Srivari Vaikunta Dwara Darshan) దర్శనాలకు ఈ-డిప్ తీయనున్నారు. ఈ-డిప్ లో ఎంపికైన భక్తులకు ఆన్ లైన్ లో టోకెన్లు కేటాయించనున్నారు. ఈ డిప్ లో ఎంపికైన వారి వివరాలను మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. తొలి మూడు రోజులకు ఈ-డిప్ విధానం పెట్టారు. టోకెన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 1.76 లక్షల మందికి దర్శన భాగ్యం కలిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24 లక్షల మంది భక్తులు పేర్లు నమోదయ్యాయి. టీటీడీ మొబైల్ యాప్(TTD Mobile App) ద్వారా 13.4 లక్షలు, టీటీడీ వెబ్ సైట్ లో 9.3 లక్షలు, ప్రభుత్వ వాట్సాప్ ద్వారా 1.5 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. మిగతా 7 రోజులు జనవరి 2 నుంచి 8 వరకు నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కలగనుంది. చివరి 7 రోజుల్లో రోజుకు 15 వేల రూ. 300 టికెట్లు ఈ నెల 5న విడుదల కానున్నాయి. చివరి 7 రోజుల్లో రోజుకు వెయ్యి శ్రీవాణి టికెట్లు ఈ నెల 5న విడుదల కానున్నాయి. జనవరి 6,7, 8 న స్థానికుల కోసం రోజుకు 5 వేల టోకెన్లు ఈ నెల 10న విడుదల చేయనున్నారు.