6 July, 2026 | 2:55 AM

రైస్‌మిల్.. డేంజర్ బెల్!

06-07-2026 01:45 AM
  1. జాతీయ రహదారికి ఆనుకుని రైస్ మిల్‌ల ఏర్పాటు
  2. దుమ్ము, ధూళితో వాహనదారులకు తప్పని ఇక్కట్లు                        
  3. నిబంధనలు పాటించకున్నా  పట్టించుకోని అధికారులు
  4. తగు చర్యలు తీసుకోవాలని   స్థానికుల వేడుకోలు

గరిడేపల్లి, జూలై 5 : ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వాటికి అధి క రాయితీలు కల్పించడంతో అనేక మంది ఔత్సాహికులు వాటి ఏర్పాటుపై దృష్టి సారించారు. అయితే సాగర్ ఆయకట్టు అ యిన ఈ ప్రాంతంలో వంద శాతం వరి పం టనే సాగు చేస్తున్నందున ఇటీవల కాలంలో బాగా రైస్ మిల్లులను ఏర్పాటు చేస్తున్నారు. మిర్యాలగూడ ప్రాంతం ఆసియా ఖండంలోనే రైస్ మిల్లులకు ప్రసిద్ధి చెందడంతో గతంలో మిల్లుల ఏర్పాటు అక్కడే ఎక్కువగా జరిగేది. అక్కడ భూములు రేట్లు బాగా పెరగడంతో మిల్లుల ఏర్పాటుకు ఇతర ప్రాంతాల వైపుకు చూపు మరల్చారు.

ఔత్సాహికుల చూపు ఇటువైపు : 

రైస్ మిల్లులు ఏర్పాటు చేయాలనుకునే వారి దృష్టి ప్రధానంగా గరిడేపల్లి, హుజూర్ నగర్ మధ్య ప్రాంతంలో పడింది. కారణం ఈ ప్రాంతం ఎత్తుగా ఉండడం, నీటి, రవా ణా, మిల్లులకు అవసరమైన వసతులు ఉం డడంతో మిల్లుల ఏర్పాటు చేయాలనుకునే వారు ఈ ప్రాంతంలో ఏర్పాటుకు పూ నుకుంటున్నారు. దీంతో మండలంలో రైస్ మిల్లుల సంఖ్య పెరుగుతుండడం వాటిలో కొన్ని నిబంధనలను సక్రమంగా పాటించక పోవడంతో అవి డేంజర్ బెల్ లను మోగిస్తున్నాయి.

మండలంలో పెరుగుతున్న మిల్లులు

 గరిడేపల్లి మండలంలో ఒకప్పుడు కేవ లం గడ్డిపల్లి గ్రామంలో మాత్రమే ఓ ఫార్ బాయిల్ రైస్ మిల్ ఉండేది. కానీ ఇటీవల కాలంలో వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆ ఒక్క గ్రామంలోనే ఇప్పుడు మూ డు మిల్లులు ఏర్పాటు అయ్యాయి అంటే వాటిని ఏర్పాటు చేసేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నారో.. అర్థం చేసుకోవచ్చు. ఇక మండల విషయానికి వస్తే ఇప్పటికే మొత్తం ఆరు పార్ బాయిల్ రైస్ మిల్లులు నడుస్తుండగా.. మరో మూడు మిల్లుల ఏర్పాటుకు రంగం సిద్ధం కాగా ఇప్పటికే రెండు మిల్లులు పనులు ప్రారంభం అయినట్టు తెలుస్తుంది. ఇవి కాక మండలంలో గతంలోనే ఓ మిల్లు సిఎంఆర్ ను గడువులోగా చెల్లించకపోవడంతో అధికారులు సీజ్ అయిన విషయం విధితమే.

సీఎంఆర్‌పై ఆధారపడే మిల్లులు 

వాస్తవికంగా రైస్ మిల్లుల ఎక్కువ శాతం ప్రభుత్వం ఇచ్చే సీఎంఆర్ పైనే ఆధారపడి నడిపించేందుకు పూనుకుంటున్నారనేది అం దరి నోళ్లలో నానుతున్న మాట. అలా ఐతేనే ధాన్యం వచ్చిన తర్వాత సీఎంఆర్ పెట్టేందుకు కొంత గడువు ఉంటుందని.. ఈ లోగా ఏదో ఒకటి చేసి మనం మాత్రం సేఫ్ సైడ్ లో ఉండొచ్చనే ఆలోచన తోనే చాలామంది మిల్లుల ఏర్పాటుకు పూనుకుంటున్నారని స్థానికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలకు నీళ్లు ?

 అయితే ఇప్పటికే నడుస్తున్న మిల్లులలో కొందరు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అక్రమ విధానంలో అనుమతులు తెచ్చుకుని ఎటువంటి జాగ్రత్తలు పా టించకుండానే యధ్ధేచ్చగా మిల్లులు నడుపుతున్నారని మండలంలో పెద్ద చర్చే నడు స్తుంది. ఇదిలా ఉండగా గరడేపల్లి- హుజూర్ నగర్ మండలాల సరిహద్దులో జాతీయ ర హదారి 167కు ఆనుకుని కట్టబడిన ఓ మి ల్లును ఏ మాత్రం నిబంధనలు పాటించకుం డా నడిపిస్తున్నారని రోడ్డుపై వెళ్ళే వా హదారులు చెబుతున్నారు. ఈ మిల్లులో ఎటు వంటి జాగ్రత్తలు పాటించకుండా నడుపుతుండడంతో దుమ్ము, ధూళి రోడ్డుపై వెళ్ళే వాహనదారుల కళ్లలో పడి ప్రమాదాలబారిన పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.

ఈ మి ల్లు కారణంగానే గత సంవత్సరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక యువకుడు మృత్యువాత పడ్డాడనే అభియోగాలు వచ్చా యి. అదే విధంగా సరియైన నాణ్యత ప్రమాణాలు లేని మెటీరియల్ వాడడం, ఎటువం టి రక్షణ వలయాలు ఏర్పాటు చేయకుండా మిల్లు నడపడంతో దాని నుండి జారిపడిన ఇనుప కడ్డీలు గత జూన్ నెలలో రోడ్డుపై వె ళ్తున్న వారికి తగిలి ఇద్దరికి కాళ్లు ప్రమాదకరంగా విరిగి ప్రాణాపాయం నుండి బయట పడగా సుమారు పది మందికి గాయాలైన ట్లు స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతుండటం గమనార్హం.

ఇంత జరుగుతున్న అధికా రులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పం దించి నిబంధ నలు పాటించని మిల్లర్ లపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.    

భయమై వేగంగా వస్తున్నా..                   

రాయినిగూ డెం దాటగానే ఉన్న మిల్లు రో డ్డుకు పక్కనే ఉం ది. మిల్లు వద్దకు రాగానే కళ్ళలో మిల్లుకు సంబంధించిన వరిపొట్టు నలకబడింది. దాంతో నాకు చాలా ఇబ్బంది కలిగింది. పక్కనే వెళ్తున్న వాహదారుడు సాయంచేసి నా దస్తితో నలక తీశాడు. తదుపరి మొన్ననే ఈ మిల్లు నుండి సుమారు 15, 20 ఇనుప రేకులతో కూడిన ఇనుప కడ్డీలు జారి వచ్చి రోడ్డుపై వెళ్తున్న వారిపై పడి ఒకాయనకి రెండు కాళ్ళు గుల్లగుల్లగా విరగ గా, మరొకాయనకి ఒకకాలు విరిగిందని చెప్పాడు. నాకు భయమై అక్కడి నుంచి వెంటనే వేగంగా వస్తున్న.

 ఎ.బాలాజీ, వాహనదారుడు