15-10-2025 06:12:24 PM
సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): రైస్ మిల్ మహిళా కార్మికుల వేతన ఒప్పందం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు, సుల్తానాబాద్ రైస్ మిల్లు మహిళా కార్మికుల విస్తృత జనరల్ బాడీ సమావేశం బుధవారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రి నగర్ లో జరిగింది. దీనికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లులలో పనిచేస్తున్న బార్ధాన్ రిపేరు, సంచులు దులపడం, ఘట్టాలు కట్టడం, మిల్లులను శుభ్రంగా ఉంచడానికి ఉడువడం, తుడువడం తదితర పనులు చేస్తున్న మహిళా కార్మికుల వేతన ఒప్పందం 2025 సెప్టెంబర్ తో ముగిసిందని కాలపరిమితి ముగిసినందున మహిళా కార్మికులకు పెరిగిన నిత్యవసర సరుకుల, వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచడానికి వెంటనే యూనియన్ నాయకత్వంతో చర్చించాలని రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ కు విజ్ఞప్తి చేశారు.
రైస్ మిల్లులో పనిచేస్తున్న మహిళా కార్మికులు బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద వారిని వీరి న్యాయమైన సమస్యల పరిష్కారానికి వేతన ఒప్పందానికి యజమానులు వెంటనే ముందుకు రావాలని, లేకుంటే కార్మికులందరికీ సమీకరించి ఆందోళన బాట పట్టవలసి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సుల్తానాబాద్ మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య, మహిళా కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు గున్నాల అన్నపూర్ణ, ప్రధాన కార్యదర్శి సలోని పలువురు ఉన్నారు.