calender_icon.png 15 October, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్ఫ్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

15-10-2025 06:15:39 PM

మెట్ పల్లి (విజయక్రాంతి): కుటుంబ పోషణ కోసం గల్ఫ్ బాట పట్టి అక్కడే మృతి చెందిన లఖావత్ రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొక్కెనపల్లి నాగరాజ్ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మల్లాపూర్ మండలంలోని వాల్గొండ తాండాకి చెందిన లఖావత్ రమేష్ దుబాయికి ఉపాధి నిమిత్తం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ బాట పట్టి గుండెపోటుతో షార్జాలో మరణించినట్టు తెలిసింది. దుబాయ్ నుండి రమేష్ పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొక్కెనపల్లి నాగరాజ్, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరి కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం తరఫున తక్షణ చర్యలు తీసుకుంటామని భీమ రెడ్డి తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో సుఖీభవ ఆర్గనైజేషన్ సభ్యులు న్యాయవాదులు, సూర్యకిరణ్, సురేష్,రవి, వివేక్, రిషి, అంజయ్య, సాహు మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.