12 April, 2026 | 4:46 AM

సోషల్ మీడియాపై ఉక్కుపాదమే!

29-08-2024 12:00 AM

యూపీ సర్కారు కొత్త బిల్లు

లక్నో, ఆగస్టు 28: సోషల్‌మీడియాపై నియంత్రణే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై యూజర్లు అభ్యంతరకర కంటెంట్ ప్రచారం చేస్తే కఠిన శిక్షలు పడేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే జీవిత ఖైదు విధించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

ఈ బిల్లు చట్టంగా మారితే.. దీని ప్రకారం నమోదయ్యే కేసుల్లో మూడేండ్ల నుంచి జీవితకాల శిక్షలు ఉంటాయి. కొత్త బిల్లులో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వం ఓ శుభవార్త కూడా చెప్పింది. నెలకు రూ.8 లక్షల వరకు ఆదాయం సంపాదించే సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్స ర్లకు ప్రభుత్వం ప్రకటనలు కూడా ఇచ్చేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. వారికి ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తుంది.