30 June, 2026 | 8:36 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

రంజాన్ పురస్కరించుకొని ఈద్గా కబ్రస్థాన్ చదును

16-03-2026 06:27 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలో భాగంగా సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఈద్గా కబ్రస్తాన్లో 9వ వార్డు కౌన్సిలర్ తోర్రికొండ ప్రభాకర్ జెసిబి బ్లేడ్ తో చదును చేయించారు. అంతేకాకుండా మున్సిపల్ సిబ్బందిచే ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ తొర్రికొండ ప్రభాకర్ మాట్లాడుతూ... పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొంటారు.

పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం మైనార్టీలు సంతోషాలతో జరుపుకోవాలని కఠోర ఉపవాస దీక్షలో ఉండి అల్లా కు ప్రార్థించడం వల్ల ఈ ప్రాంతం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ తో పాటు ఈద్గా కబ్రిస్తాన్ అధ్యక్షులు పహీం, ఉపాధ్యక్షులు నయీం, సభ్యులు సంధాని, బాబర్, మోబిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తొర్రికొండ ప్రభాకర్ కు, పహీమ్, నయీమ్  కృతజ్ఞతలు తెలిపారు.