16 March, 2026 | 7:40 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల సమన్వయం అవసరం

16-03-2026 06:32 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. సోమవారం ఆయన అమీర్ పేట లోని బుద్దానగర్ లో  వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నూతనంగా చేపట్టిన స్ట్రామ్ వాటర్ లైన్ పనులను పరిశీలించారు.

స్ట్రామ్ వాటర్ లైన్ నిర్మాణ పనులు సక్రమంగా జరగడం లేదని, లెవెల్స్ ప్రకారం పైప్ లైన్ ఏర్పాటు చేయడం లేదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. నిర్మాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ లో తాము ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్ట్రామ్ వాటర్ లైన్ పనుల తో డ్రైనేజీ లైన్ కూడా దెబ్బతిన్నదని, మరమ్మతులు చేసేలా చూడాలని కోరారు. అదేవిధంగా తమ కాలనీలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు.

స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ట్రామ్ వాటర్ లైన్ పనుల అనంతరం ఇబ్బందులు తలెత్తకుండా ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దెబ్బతిన్న డ్రైనేజీ లైన్ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. స్ట్రామ్ వాటర్, డ్రైనేజీ లైన్ లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాతనే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ స్తంభాలు కూడా వెంటనే ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా అభివృద్ధి పనులలో అధికారులకు తమవంతు సహకారం అందించాలని చెప్పారు.

తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న విషయం నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, లలిత, గోపిలాల్ చౌహాన్, వేణు గౌడ్, గొలుసుల సత్యనారాయణ, వనం శ్రీనివాస్, హరిసింగ్, జితేందర్ శుక్లా, కాలనీ వాసులు రోజారెడ్డి, బాజీ, అనిల్, కృష్ణ, తదితరులు ఉన్నారు.