15 June, 2026 | 11:11 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

నంబర్ వన్ స్థాయికి ఎదగాలి

20-11-2024 12:00 AM

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం గల దేశంగా మనం నిలబడాలంటే అగ్రరాజ్యాలకు దీటుగా బలమైన అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. దానికోసం భారత్ సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎగుమతుల సామర్థ్యం బాగా పెంచుకోవాలి. అంతరిక్ష రంగంలో మంగళయాన్, చంద్రయాన్ రక్షణ రంగంలో అగ్ని- శనివారం సాధించిన హైపర్ సోనిక్ ప్రయోగాల విజయాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.

ధ్వని వేగానికి ఐదు రెట్లు అధికంగా దూసుకెళుతూ, శత్రుదేశాల గగనతలాల రక్షణ వ్యవస్థల అంచనాలకు అందకుండా 1,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఎదుర్కొనే సత్తా కలిగి వుండటం మన హైపర్ సోనిక్ క్షిపణి ప్రత్యేకత. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఈ ప్రయోగం వల్ల చైనా, రష్యా, అమెరికా వంటి బలమైన దేశాల సరసన మన శాస్త్రవేత్తల కృషి మరోసారి చరిత్ర సృష్టించింది. అణ్వాయుధాలతో యుద్ధా లు అనివార్యం కాకున్నా స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతికతను మెరుగు పరిచేలా బలమైన రక్షణ వ్యవస్థను నిర్మించుకోవడం అవసరం. 

చైనా, పాకిస్థాన్‌ల నుంచి భవిష్యత్తులో రాబోయే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పలు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలి. డ్రోన్లు, యుద్ధ విమాన ఇంజన్లు వంటివాటి త యారీలో వ్యూహాత్మకంగా వ్యవహరించవలసి ఉంది. డా॥ అబ్దుల్ కలాం అన్నట్లు బలమైన వారినే ప్రపంచం గౌరవిస్తుంది కనుక మన సాంకేతికతను ప్రపంచం నేర్చుకునే స్థాయికి దేశీయ రక్షణ పరికరాల ఎగుమతులు పెరగాలి. 2047 ‘వికసిత భారత్’ నాటికి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుందని ఆశిద్దాం. 

- ఫిజిక్స్ అరుణ్ కుమార్, నాగర్‌కర్నూల్