2 March, 2026 | 1:27 AM

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

01-03-2026 12:00 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఎండలు మండిపోతున్నాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలపైనే నమోదయ్యాయి. రెండు రోజులుగా మధ్యాహ్నం సమయంలో ఉక్కపోస్తున్నది. పలు జిల్లాల్లో 35 నుంచి 36 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవు తున్నాయి. ఆది, సోమవారాల్లో కూడా రాష్ట్రం లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.