11 May, 2026 | 9:47 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ఐసీసీకి కొత్త మహిళా డైరెక్టర్!

23-08-2024 12:00 AM

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) కొత్త మహిళా స్వతంత్య్ర డైరెక్టర్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టులో పెప్సికో హెడ్ ఇంద్రనూయీ ఉన్నారు. ఆరు సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఇంద్రనూయీ పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. అంతే కాకుండా వరల్డ్ బాడీకి కూడా త్వరలో కొత్త చైర్మన్ రానున్నారు. బీసీసీఐ సెక్రటరీ జైషా చైర్మన్ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఇంద్రనూయీ 2018లో ఐసీసీ మొదటి మహిళా స్వతంత్య్ర డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఈ పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. నూయీ లాంటి పవర్‌ఫుల్ మహిళ కోసం ఇప్పటికే ఐసీసీ వెతుకుతున్నట్లు సమాచారం.