6 June, 2026 | 7:34 PM

లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

06-06-2026 06:24 PM

 ఇద్దరు మైనర్ బాలురు మృతి

షాద్‌నగర్,(విజయక్రాంతి): షాద్‌నగర్ పట్టణ శివారులోని లింగారెడ్డిగూడ గ్రామం సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ బాలురు దుర్మరణం పాలయ్యారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు బాలురు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, అత్యంత వేగంగా వెళ్తున్న బైక్ ముందుగా ఓ జేసీబీని ఢీకొని, అనంతరం ఎంఎస్‌ఎన్ బస్సును ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదం తీవ్రతకు బైక్ పూర్తిగా ధ్వంసమై, బాలురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వయస్సు సుమారు 16 సంవత్సరాల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.