10 May, 2026 | 2:32 PM

Breaking News

మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •  

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

30-12-2024 07:40 PM

మెదక్: మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులతో సహ మరో ముగ్గురికి గాయలయ్యాయి. గమనించిన స్థానికులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోనుంచి మృతదేహన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందినా మహిళ నవ్య(28)గా గుర్తించారు. కుటుంబంతో ఏడుపాయల వనదుర్గమాత దర్శనానికి కారులో వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.