10 May, 2026 | 3:00 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం

10-05-2026 02:22 PM

దమ్మపేట,(విజయక్రాంతి): కార్మిక చట్టాలను అమలు చేయకుండా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరించి నూతన లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని, వెంటనే లేబర్ కోడ్ లును రద్దు చేయాలని, లేబర్ కోడ్ ల రూల్స్ గెజిట్ ప్రతులను ఆదివారం ఎస్బీఐ సెంటర్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ... కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వస్తున్న నాలుగు కార్మిక లేబర్ కోడ్ లు దేశ కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఈ నిబంధనలను నోటిఫై చేసిందని, లేబర్ కోడ్ లు రద్దయ్యేంతవరకు అలుపెరగని ఉద్యమాలు నిర్వహించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, కోటేశ్వరరావు, ధర్మ, కార్తీక్, ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.