10 May, 2026 | 3:08 PM

Breaking News

పేదల ఇంటి కలను నిజం చేస్తున్న నాయకుడు   •   కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని మోదీ   •   సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •  

కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

10-05-2026 01:59 PM

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ నగరంలోని ములుగు రోడ్డులో గల మాలిక్ కియా షోరూంలో కియా సంస్థ రూపొందించిన సరికొత్త మోడల్ 'కియా సైరోస్'  కారును హనుమకొండ డీసీసీ అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇనగాల కారు ఫీచర్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, గరిష్ట భద్రతా ప్రమాణాలతో కూడిన వాహనాలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన అన్నారు. కియా సైరోస్ కారు వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నవీన్, మహేష్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.