10 May, 2026 | 1:27 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

10-05-2026 12:48 PM

మంథని,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండెపోటుతో మృతి చెందితే అంతిమయాత్రలో పాల్గొని టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు పాడే మోసి కాంగ్రెస్ పార్టీ నాయకుల పై కార్యకర్తలపై తన అభిమానాన్ని చాటుకున్నారు. మంథని నియోజకవర్గంలోని మహదేవ్ పూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ వార్డు సభ్యులు పర్శవేణి రాజమల్లు యాదవ్ శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న శ్రీను బాబు ఆదివారం వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి వారి అంతిమ యాత్రలో  పాల్గొన్నారు.  కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యాన్ని కల్పించారు.