23 May, 2026 | 7:23 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

రాజస్థాన్‌లో రోడ్డుప్రమాదం

30-10-2024 02:20 AM

12 మంది ప్రయాణికులు మృతి

జైపూర్, అక్టోబర్ 29: రాజస్థాన్‌లో మంగళవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మరణించారు. సలాసర్ నుంచి వస్తున్న బస్సు సికర్ జిల్లాలోని లక్ష్మణ్‌ఘర్ వద్ద ఫ్లు ఓవర్ గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగం ఇనుప ముద్దగా మారిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించినట్లు జిల్లా ఎస్పీ భువన్ భూషణ్ యాదవ్ తెలిపారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను క్రేన్ సాయంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డవారిని జైపూర్‌తోపాటు ఇతర ప్రాంతాల దవాఖానలకు తరలించినట్లు సికర్ ఐజీపీ సత్యేంద్ర సింగ్ వెల్లడించారు.