31 July, 2026 | 1:56 AM

హారర్.. థ్రిల్లింగ్ పోలీస్ కంప్లైంట్

31-07-2026 01:25 AM

‘పోలీస్ కంప్లుంట్’.. హారర్, థ్రిల్లర్, యాక్షన్ అంశాల మేళవింపుతో కూడిన కథను టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై వినూత్నంగా ఆవిష్కరించిన చిత్రం. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించగా, సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. వరలక్ష్మి శరత్‌కుమార్ తన కెరీర్‌లోనే తొలిసారి వినోదాత్మక పాత్రలో కనిపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

దానికి తోడు నవీన్ చంద్ర నటన కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్రంలో ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను హారర్ థ్రిల్లర్ రూపంలో ఆవిష్కరించారు డైరెక్టర్ సంజీవ్ మేగోటి. గత జూన్‌లో తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో; డీవోపీ: ఎస్‌ఎన్ హరీశ్ సొండెకొప్ప; ఎడిటర్: అనుగోజు రేణుకాబాబు; ప్రొడక్షన్ డిజైన్: కొండపనేని మురళీధర్.