30 July, 2026 | 10:03 PM

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబం తీజ్ ఉత్సవాలు

30-07-2026 09:26 PM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

రేగొండ రామన్నగూడెం తండాలో ఘనంగా తీజ్ పండుగ వేడుకలు  

భూపాలపల్లి/రేగొండ,(విజయక్రాంతి): సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం తీజ్ ఉత్సవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రేగొండ మండలం రామన్నగూడెం తండాలో గురువారం ఘనంగా నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, లంబాడా సంస్కృతి, సంప్రదాయాలు తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.

మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే తీజ్ పండుగ ఆనందోత్సాహాలకు ప్రతీక అని అన్నారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లంబాడా సోదరమణులతో కలిసి నృత్యం చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మహిళలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, లంబాడా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.