ట్రావెల్స్ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు: 30 మందికి గాయాలు
02-11-2024 10:27 AM
హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలోని కట్టకొమ్ముగూడెం క్రాస్ రోడ్డు వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సు ప్రైవేటు ట్రావెల్ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొనడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రెండు బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నలుగురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




