31 March, 2026 | 6:10 PM

Breaking News

దొంగతనాన్ని అడ్డుకున్న మహిళా కార్మికురాలు   •   మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా   •   పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి   •   ఎమ్మెల్సీని సన్మానించిన బిజెపి నాయకుడు లింగాల శంకర్   •   మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్   •   కేవీకేలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు   •   ముత్తారంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి   •   బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి   •   ఎన్నికల వేళ భారీ షాక్... టీవీకే విజయ్‌పై కేసు నమోదు   •   పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా.. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లింపు   •  

హనుమకొండ జిల్లాలో బీసీ కమిషన్ పర్యటన

02-11-2024 11:36 AM

హైదరాబాద్: హనుమకొండ జిల్లాలో బీసీ కమిషన్ బృందం శనివారం పర్యటిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ దామాషా ఖరారుకు బహిరంగ సభ నిర్వహించారు. బీసీ కులాల సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. బీసీ కమిషన్ కుల సంఘాల, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. హనుమకొండ కలెక్టరేట్ ఆడిటోరియంలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు హాజరయ్యారు. శనివారం ఉదయం హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. మధ్యాహ్నం మహబూబాబాద్, జనగామ జిల్లాలకు సంబంధించి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.