30 June, 2026 | 7:52 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

ఆదేశాలు ఉన్నా ఆలస్యం ఎందుకు?

10-03-2026 01:56 AM

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కిష్టారెడ్డి పేట్-మాదారం రోడ్డు 

మధ్యలోనే ఆపిన రహదారి మరమ్మత్తులు 

ఇబ్బందుల్లో వాహనదారులు

జిన్నారం/అమీన్ పూర్, మార్చి 9: కిష్టారెడ్డి పేట్ ఓఆర్‌ఆర్ నుంచి మాదారం, కొడ కంచి వరకు రహదారి మరమ్మత్తులు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన ప్పటికీ ఆర్‌అండ్ బి శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరో పిస్తున్నారు. 

అమీన్‌పూర్, జానకంపేట వరకు మాత్రమే పనులు నిర్వహించి మిగతా ప్రాంతాలను పూర్తిగా వదిలేయడంతో ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. మాదారం, కొడకంచి ప్రాంతాల మధ్య ఉన్న రహదారి ప్రస్తుతం గుంతలతో నిండిపోయి ప్రమాదాలకు కారణమవుతోంది.

రోజూ వందలాది వాహనాలు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో అదుపుతప్పి పడిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు.

మధ్యలోనే ఆపిన మరమ్మత్తులు...

కిష్టారెడ్డి పేట్ ఓఆర్‌ఆర్ రోడ్డు నుంచి జిన్నారం, కొడకంచి వరకు రాహదారి మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ప్పటికీ అమీన్ పూర్, జానకంపేట వరకు మాత్రమే పనులు చేసి మిగతా ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు వి మర్శిస్తున్నారు. పూర్తి చేయాల్సిన పనులను అర్ధాంతరంగా ఆపివేయడం వెనుక కారణాలు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారా?

రోడ్డు గుంతల కారణంగా ఇప్పటికే పలుచోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ అ ధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అంటున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన తర్వాతే చర్యలు తీసుకుంటారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మాదారం కొడకంచి మరమ్మత్తులు పూర్తి చేయాలని కోరుతున్నారు.