17 April, 2026 | 11:50 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

వర్షానికి తెగిపోయిన డైవర్షన్ రోడ్డు

28-05-2025 11:36 AM

ఏజెన్సీలో నిలిచిపోయిన రాకపోకలు 

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతం(Kothaguda Agency Area)లో కొత్తగూడా కొండంపల్లి రహదారిలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి(Heavy rain) మొండ్రాయి గూడెం వద్ద డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దీనితో ఏజెన్సీ ప్రాంతంలోని తిమ్మాపురం ఆదిలక్ష్మి పురం తో పాటు మరో ఐదు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మొండ్రాయి గూడెం వద్ద వాగు పై లో లెవెల్ బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. ఇందుకోసం పాత బ్రిడ్జిని తొలగించి తాత్కాలికంగా రాకపోకల కోసం డైవర్షన్ రోడ్డు వేశారు. వర్షాలకు వచ్చిన వరదకు డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయి జనజీవనానికి తీవ్ర ఇబ్బందిగా మారింది.