17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

విజయవాడలో పియాజియో వెహికల్స్ డీలర్‌షిప్‌ ప్రారంభం

15-04-2026 10:16 PM

విజయవాడ, ఏప్రిల్ 2026: ఐకానిక్ వెస్పా, స్పోర్టీ ఏప్రిలియా శ్రేణి స్కూటర్లు , మోటర్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ ఆటో దిగ్గజం పియాజియో గ్రూప్ యొక్క పూర్తి అనుబంధ సంస్థ అయిన పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమ మొదటి మోటోప్లెక్స్ డీలర్‌షిప్‌ను ప్రారంభించింది.  వెస్పా, ఏప్రిలియా, మోటో గూజీ బ్రాండ్‌ల పూర్తి శ్రేణి ఉత్పత్తులతో పాటు ప్రత్యేకమైన మర్చండైజ్, సీబీయూలను కొత్తగా ప్రారంభించబడిన మోటోప్లెక్స్, త్రిశూల్ ఆటో హబ్ ప్రదర్శించి, విక్రయిస్తుంది.

ఈ ప్రారంభోత్సవానికి పియాజియో ఇండియా నాయకత్వంతో పాటు, త్రిశూల్ ఆటో హబ్‌కు చెందిన రవితేజ చానుమోలు మరియు సుజయ్ పి హాజరయ్యారు. విశాలమైన ఈ డీలర్‌షిప్‌లో 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక షోరూమ్, ఆయా బ్రాండ్‌ల ఇటాలియన్ వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రీమియం కస్టమర్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన 1,323 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ప్రత్యేక సర్వీస్ వర్క్‌షాప్ కూడా వుంది. 

పియాజియో ఇండియా టూ-వీలర్ డొమెస్టిక్ బిజినెస్ ఈవీపీ అజయ్ రఘువంశీ ఈ ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ “త్రిశూల్ ఆటో హబ్ ద్వారా, వెస్పా, ఏప్రిలియా , మోటో గూజీలతో ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించి, విజయవాడలోని కస్టమర్లతో మా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సంతోషిస్తున్నామన్నారు. విజయవాడ నుండి లభించే స్పందన ఎప్పుడూ అద్భుతంగా ఉంటుందని చెప్పారు.

త్రిశూల్ ఆటో హబ్ మేనేజింగ్ పార్టనర్ రవితేజ చానుమోలు మాట్లాడుతూ ఈ ఆటో హబ్‌ ప్రారంభంతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆకర్షణీయమైన, అధిక నాణ్యత గల టూ-వీలర్ల కోసం చూస్తున్న  వినియోగదారుల ఆకాంక్షలను తీర్చటంతో పాటుగా ప్రీమియం కొనుగోలు , యాజమాన్య అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. త్రిశూల్  ఆటో హబ్ మేనేజింగ్ పార్టనర్ సుజయ్ పి మాట్లాడుతూ పనితీరు, డిజైన్, రైడింగ్ అనుభవానికి విలువనిచ్చే వినియోగదారులు,  మోటర్‌సైకిల్ ప్రియుల కోసం త్రిశూల్ ఆటో హబ్ రూపొందించబడిందన్నారు. ఈ ప్రారంభోత్సవం ద్వారా విజయవాడలో ఒక బలమైన రైడింగ్ కమ్యూనిటీని నిర్మించడానికి ఆసక్తిగా ఉన్నామన్నారు.