కోహ్లీ బాటలోనే రోహిత్ శర్మ
విజయ్‌హజారే ట్రోఫీ ఆడేందుకు నిర్ణయం
ముంబై, డిసెంబర్ 13 : వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. మ్యాచ్ ప్రాక్టీస్ పోకుండా ఉండేందుకు దేశవాళీ క్రికెట్ బరిలో దిగుతున్నారు. విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నీలో ఆడేందుకు డిసైడయ్యాడు. ఇప్పుడు రోహిత్ కూడా ఆడ బోతుండడంతో క్రేజ్ నెలకొంది. నిజానికి గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత ఫిట్‌నెస్, ఫామ్ కోసం జాతీయ జట్టు మ్యాచ్‌లు లేనప్పుడు ఏ ఆటగాడైనా దేశవాళీ క్రికెట్ ఆడా ల్సిందేనని రూల్ తీసుకొచ్చాడు.
ముంబై జట్టు తరపున రోహిత్ పలు మ్యాచ్‌లకు అం దుబాటులో ఉంటాడని తెలుస్తోం ది. ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు దీనిపై సమాచారమిచ్చాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు జరిగే మ్యాచ్‌ల లో రోహి త్ ఆడనున్నాడు. డిసెంబర్ 24 నుంచి విజ య్ హజారే ట్రోఫీ ఆరంభం కానుండగా.. జనవరి 8 వరకూ జరిగే మ్యాచ్‌లలో రోహి త్ ఆడే అవకాశముంది.
అటు కోహ్లీ, రిషబ్ పంత్ కూడా ఢిల్లీ తరపున బరిలోకి దిగుతున్నారు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఈ ట్రోఫీలో ఆడడం రోకో జోడీకి మంచి ప్రాక్టీస్‌లానే ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఎందుకంటే 2027 ప్రపంచకప్ వరకూ ఇదే ఫిట్‌నెస్, ఫామ్ కొనసాగాలంటే అప్పుడప్పుడు జరిగే కీలకమైన దేశవాళీ టోర్నీలు ఆడాలని బీసీసీఐ సైతం రోహిత్, కోహ్లీలకు స్పష్టం చేసినట్టు సమాచారం.




