calender_icon.png 14 December, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీసీ వన్డే క్రికెటర్ అవార్డు రేసులో కోహ్లీ

14-12-2025 12:00:00 AM

దుబాయి, డిసెంబర్ 13 : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఐసీసీ అవార్డును సొంతం చేసుకునేందుకు చేరువయ్యాడు. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2025కు కోహ్లీ నామినేట్ అయ్యాడు.గత ఏడాది టీ20లకు, ఈ ఏడాది జూన్‌లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌లో తొలి రెండు వన్డేల్లో నిరాశ పరిచినా తర్వాత హాఫ్ సెంచరీ సాధించాడు. తాజాగా సౌతాఫ్రికాపై వరుసగా రెండు వన్డే ల్లో సెంచరీలు బాదాడు.

గత నాలుగు మ్యా చ్‌లలోనూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను కూడా అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ ప్రదర్శనలతోనే ఐసీసీ వన్డే క్రికెటర్ అవార్డు రేసులో నిలిచాడు.కోహ్లీతో పాటు బ్రీజ్కే, జో రూట్, షై హోప్, డారిల్ మిఛెల్, మ్యాట్ హెన్రీ, ఆదిల్ రషీద్, సికిందర్ రాజా, సాంట్నర్, జేడెన్ సీల్స్ కూడా నామినేట్ అయ్యారు.

అయితే భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నామినేట్ కాలేదు. ఈ ఏదది 13 వన్డేలు ఆడిన కోహ్లీ 65.10 యావరేజ్‌తో 651 పరుగులు చేశా డు. దీనిలో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ప్రస్తుతం వన్డేల్లో కోహ్లీ 14,557 పరుగులతో ఉన్నాడు. కోహ్లీ త్వరలో జరిగే దేశవాళీ టోర్నీ విజయ్ హజారేలో ఆడబోతున్నాడు.