14-12-2025 12:00:00 AM
* తొలి టీ20 గెలిచాక అదే జోరు కొనసాగిద్దామనుకున్న భారత్‌కు ముల్లాన్‌పూర్‌లో ఊహించని షాక్.. సౌతాఫ్రికా బౌన్స్‌బ్యాక్ అయి దెబ్బకు దెబ్బ కొట్టింది. బౌలర్ల సమిష్టి వైఫల్యం.. బ్యాటర్ల మూకుమ్మడి వైఫల్యం.. వెరసి ఇండియాకు ఊహించని పరాభవం.. ఫలితంగా సిరీస్ సమం.. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో ఆధిక్యం కోసం ఇరు జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరి ధర్మశాలలో ఎవరిది పైచేయి కానుందో...
ధర్మశాల, డిసెంబర్ 13 : భారత్, సౌతాఫ్రికా టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. రెండో మ్యాచ్‌లో పుంజుకున్న సౌతాఫ్రికా సిరీస్‌ను సమం చేసింది. ఇప్పుడు మూ డో మ్యాచ్ కోసం ఇరు జట్లు రెడీ అయ్యాయి. ధర్మశాల వేదికగా ఆదివారం మూడో టీ ట్వంటీ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఆధిక్యం సా ధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉండడం తో హోరీహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
గత మ్యాచ్‌లో తప్పిదాలు రిపీట్ కాకుం డా అదరగొట్టాలని టీమిండి యా భావిస్తోంది. రెండో టీ ట్వంటీ లో భారత్ ఓటమికి చాలా కారణా లే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటర్ల వైఫల్యం దెబ్బతీసింది. అభిషేక్ శర్మ త్వరగా ఔటవడం, గిల్, సూర్యకుమార్ పేలవ ఫామ్ నుంచి బయట పడకపోవడం జట్టు పరాజయానికి కారణమైంది. ము ఖ్యంగా వైస్ కెప్టెన్ గిల్ టీ20ల్లో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. ఐపీఎల్‌లో అదర గొడుతున్న గిల్ అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం తేలి పోతున్నాడు.
దీంతో అతని కోసం సంజూ లాంటి ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేయ డంపై విమర్శలు వస్తున్నాయి. గిల్‌ను తప్పించి సంజూకు మరికొన్ని అవకాశాలివ్వాలని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైస్ కెప్టెన్ గిల్‌ను తప్పించే అవకాశం లేదనే భావిస్తున్నారు. దీంతో సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ పేలవ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. దాదాపు ఏడాదికి పైగా స్కై మెరుపులు లేవు.
ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని సూర్యకుమార్ ఈ మ్యాచ్‌తోనైనా గాడిన పడతాడేమో చూడాలి. ఇదిలా ఉంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో ఈ సారి ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి. రెండో టీ20లో అక్షర్ పటేల్‌ను పంపడం మిస్‌ఫైర్ అయింది. అక్షర్ పటేల్ ప్రయోగం బెడిసికొట్టిందనే చెప్పాలి. మాజీలు సైతం ఈ ప్రయోగంపై విమర్శలు గుప్పించారు. కీలక బ్యాటర్లను పక్కన పెట్టి బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను టాపార్డర్‌లో పంపడం ప్రపం చకప్‌కు ముందు సరైన ప్రయోగం కాదం టూ ఫైర్ అయ్యారు.
దీం తో మూడో స్థానం లో రెగ్యులర్ బ్యాటర్లనే ఆడించే అవకాశముంది. అలాగే హార్థిక్ పాండ్యా, శివమ్ దూ బేతో పాటు ఫినిషర్ రోల్‌గా భావిస్తున్న జితేశ్ శర్మ కూడా బ్యాట్ కు పనిచెప్పాల్సిందే. ఇక బౌలింగ్ విషయానికొస్తే రెండో టీ ట్వంటీలో అందరూ తేలిపోయారు. పేసర్లు బుమ్రా, అర్షీదీప్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యారనే చెప్పాలి. హా ర్థిక్ , దూబే కూడా రాణిస్తే సఫారీలను కట్టడి చేయొచ్చు.
స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ పర్వాలేదనిపిస్తున్నారు. ఈ కాంబినేషన్‌ను చూస్తే హర్షిత్ రాణాకు మరోసారి నిరాశే మిగిలే ఛాన్సుంది. ఒకవేళ ధర్మశాల పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని హర్షిత్‌ను తీసుకుంటే వరుణ్ లేదా అక్షర్ పటేల్‌లో ఒకరిపై వేటు పడుతుంది.
మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓడినప్పటకీ సౌతాఫ్రికా అద్భుతంగా పుంజుకుంది. డికాక్ విధ్వంసంతో మిల్లర్ మెరుపులతో భారీస్కోరు చేయడమే కాదు సిరీస్‌ను సమం చేసింది. అటు బౌలింగ్‌లోనూ సమిష్టిగా రాణించి భారత్‌ను దెబ్బకొట్టింది. దీంతో అదే జోరు కొనసాగించి సిరీస్‌లో ఆధిక్యం అందుకోవాలని భావిస్తోంది.
గత రికార్డులు
ఇరు జట్లు ఇప్పటి వరకూ 33 మ్యాచ్‌లలో తలపడగా.. భారత్ 19 సార్లు, సౌతాఫ్రికా 13 సార్లు గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
పిచ్ రిపోర్ట్
మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ధర్మశాల స్టేడియం హిమలయాలకు పక్కనే ఉంది. ఈ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు, బౌలర్లకు సమా నంగా అనుకూలిస్తుంది. మంచు ప్రభావం దృష్ట్యా ఛేజింగ్ టీమ్‌కు ఎక్కువ విజయావకాశాలుంటాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన జట్టు కనీసం 210 ప్లస్ స్కోర్ చేయాల్సి ఉంటుంది.
భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్ వర్మ, జితేశ్ శర్మ (కీపర్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్‌సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
సౌతాఫ్రికా తుది జట్టు (అంచనా)
డికాక్(కీపర్), మార్క్మ్ (కెప్టెన్), స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, మార్కో యెన్సన్, సిపామ్ల,/కార్బిన్ బోస్చ్, కేశవ్ మహారాజ్, ఎంగిడి, నోర్జే