8 April, 2026 | 12:27 PM

సిక్సర్ల కింగ్ రోహిత్

01-12-2025 01:29 AM

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన రోహిత్ పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. అఫ్రిది 351 సిక్సర్లు కొడితే.. రోహిత్ 352 సిక్సర్లు బాదాడు.

హిట్‌మ్యాన్ ఈ ఘనతను 269వ వన్డే ఇన్నింగ్స్‌లో సాధించగా.. అఫ్రిది 369  ఇన్నింగ్స్‌లలో 351 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం సిక్సర్ల వీరుల జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో ఉండగా.. అఫ్రిది, గేల్, జయసూర్య, ధోనీ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇదిలా ఉంటే పుల్ షాట్ ఆడడంలో దిట్టగా పేరున్న హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లోనూ అదే షాట్‌తో సఫారీ బౌలర్ యెన్సన్‌కు చుక్కలు చూపించాడు. 2015 నుంచి ఇప్పటి వరకూ అన్ని ఫార్మాట్లలో కలిపి 570 పుల్ షాట్లు ఆడిన రోహిత్ 116 సిక్సర్లను కొట్టాడు.