23 June, 2026 | 1:53 AM

రొమాంటిక్ రాజా ది రాజా

23-06-2026 12:40 AM

రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘రాజా ది రాజా’. అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కే నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మి స్తుండగా, కే శ్రీలతారెడ్డి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో సాయికుమార్, నరేశ్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, భద్రం, మైమ్ మధు, ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా చిత్రబృందం ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రానుంది. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వారి సరదా ప్రయాణాన్ని హైలైట్ చేశారు. ఈ పోస్టర్ చిత్రంలోని రొమాంటిక్ మూడ్‌ను ప్రజెంట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. రవికిరణ్ బోయిడపు సినిమాటోగ్రఫీ అం దిస్తుండగా, విజయ్‌కుమార్ పసుపులేటి ఆర్ట్ డైరెక్టర్.