23 June, 2026 | 1:53 AM

3డీ వెర్షన్‌లో హనుమాన్.. మరింత గొప్ప అనుభూతి

23-06-2026 12:44 AM

యువ కథానాయకుడు తేజ సజ్జ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కే నిరంజన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమా 2024లో విడుదలై, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడీ సినిమాను 3డీ వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ కొత్త వెర్షన్ జూన్ 25న థియే టర్లలో రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ 3డీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. టాలీవుడ్ హీరో సాయిదుర్గతేజ్ ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌లో సాయిదుర్గతేజ్ మాట్లాడుతూ.. “మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు కొత్త టెక్నాలజీతో ఈ మంచి అనుభూతి పంచాలని హనుమాన్’ సినిమా నిర్మించారు. ఇప్పుడు సినిమా 3డీ రూపంలో వస్తోంది. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు నాకు మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంటుంది. హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనను మళ్లీ ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది” అని చెప్పారు. చిత్ర కథానాయకుడు తేజ సజ్జ మాట్లాడుతూ.. “ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ ఇలాంటి సినిమా దొరకదు. అలాంటి సినిమాలో నటిం చే అవకాశం రావడం, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందడం నా అదృష్టం” అన్నారు. ‘హనుమాన్ సినిమాను 2డీ వెర్షన్‌లో ఎంత గా ఆస్వాదించారో, 3డీలో అంతకంటే అద్భుతంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాన’ని నిర్మాత నిరంజన్‌రెడ్డి తెలిపారు. 

నిర్మాత చైతన్యరెడ్డి మాట్లాడుతూ.. ‘హనుమాన్ చిత్రానికి ప్రేక్షకులు అందించిన అపారమైన ఆదరణకు ప్రతిగా మేమేం చేయగలమని ఆలోచించి, 3డీలో విడుదల చేయా లని నిర్ణయించుకున్నాం’ అని చెప్పారు. హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ.. “హనుమాన్ 3డీ చూసిన తర్వాత మళ్లీ గూస్‌బంప్స్ వచ్చాయి. ఈ వెర్షన్‌ను ఎంతో అద్భు తంగా తీర్చిదిద్దారు” అని చెప్పింది. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గౌర హరి, 3డీ కిరణ్ కూడా మాట్లాడారు.