9 May, 2026 | 2:18 PM

Breaking News

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •  

సచిన్ రికార్డును రూట్ బద్దలు కొడతాడు

16-08-2024 12:00 AM

 మాజీ క్రికెటర్ పాంటింగ్

దుబాయ్: టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డు (టెస్టు క్రికెట్)ను ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ బద్దలు కొట్టే అవకాశముందని ఆసీస్ మాజీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. రూట్ ఇటీవలే టెస్టుల్లో 12 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏడో బ్యాటర్‌గా రూట్  రికార్డులకెక్కాడు. అయితే 12వేల మార్క్‌ను అందుకోవడానికి రూట్‌కు కేవలం 143 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే అవసరమయ్యాయి. రూట్ ఖాతాలో 32 సెంచరీలు, 63 అర్థశతకాలు ఉన్నాయి. ప్రస్తుతం రూట్ వయస్సు 33 సంవత్సరాలు కావడంతో.. అతడు కనీసం మరో నాలుగేళ్లు క్రికెట్ ఆడే అవకాశముందని పాంటింగ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో మాస్టర్ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసే చాన్స్ రూట్ ముంగిట ఉందని పాంటింగ్ తెలిపాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200 టెసుల్లో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. ఇక పాంటింగ్ 13,378 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.