9 May, 2026 | 3:33 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

వినేశ్ హార్ట్ బ్రేకింగ్ పోస్టు..

16-08-2024 12:00 AM

పారిస్: ఒలింపిక్ ఫైనల్ వరకు దూసుకెళ్లి అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) తీర్పు వెలువడిన అనంతరం సోషల్ మీడియాలో తొలిసారి స్పందించింది. కాస్ తీర్పు వినేశ్ ఫొగాట్‌కు వ్యతిరేకంగా వచ్చిన విషయం తెలిసిందే. కాస్ తీర్పుతో తీవ్ర నిరాశకు గురైన వినేశ్ మ్యాట్ మీద పడుకుని ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పోస్టు వైరల్‌గా మారింది. డైమండ్ లాంటి వినేశ్ ఉండగా.. మాకు గోల్డ్ మెడల్ ఎందుకు? అని నువ్వే మా అసలైన చాంపియన్ అని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వినేశ్ కనుక ఫైనల్ ఆడి ఉంటే.. స్వర్ణం కానీ రజతం కానీ తప్పనిసరిగా వచ్చేది. కానీ దురదృష్టం బరువు రూపంలో వెంటాడి భారతీయులకు తీరని శోకాన్ని మిగిల్చింది. వినేశ్ ఫొగాట్ కాస్‌లో అప్పీల్ చేసినా కానీ ఫలితం మాత్రం నిరాశపర్చింది.