6 July, 2026 | 9:08 PM

Breaking News

ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •   అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ   •  

రెచ్చిపోయిన రౌడీషీటర్‌.. యూట్యూబర్‌పై దాడి

07-08-2024 01:12 PM

హైదరాబాద్: నగరంలో న్యూస్ ఛానల్ నడుపుతున్న యూట్యూబ్‌ ఛానెల్‌ రిపోర్టర్‌ మూబీన్‌పై రౌడీ షీటర్ సోహెల్ కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది. అడ్డుకోబోయిన వారిపైనా రౌడీషీటర్‌  దాడి చేశాడు. వట్టెపల్లికి చెందిన బాధితుడు ముబీన్ మీర్జా, మహమూదా హోటల్ సమీపంలో నిలబడి ఉండగా, రౌడీ షీటర్ సోహైల్, అతని సహచరులు వచ్చి అకస్మాత్తుగా బాధితుడి ముఖంపై కత్తితో దాడి చేశారు. క్షతగాత్రుడిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ముబీన్ మీర్జా గత నెల రోజులుగా నగరం, ఇతర చోట్ల మతపరమైన స్థలాలను కూల్చివేయడానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తారు. రౌడీషీటర్‌ అరాచకాలు వెలుగులోకి తెచ్చినందుకు, యూట్యూబ్‌ నుంచి లింక్‌ తీసేయాలని.. లేకపోతే చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.