6 July, 2026 | 7:12 PM

బాలాపూర్ లో రౌడీషీటర్ దారుణ హత్య

09-08-2024 12:55 PM

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంచెన్ బాగ్ కు చెందిన రియాజ్ అనే రౌడీషీటర్ దారుణ హత్య కు గురయ్యాడు. గుర్తు తెలియని  దుండగులు బాలాపూర్ ఆర్ సీ ఐ  రోడ్డు లో రియాజ్ ద్వి చక్ర వాహనాన్ని  కారుతో ఢీ కొట్టారు. అనంతరం కాల్పులు జరిపి హతమార్చారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు  పరిశీలించారు. ఘటనా స్థలం లో పోలీసులు బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. రియాజ్ పై పలు కేసులున్నాయని సీపీ తెలిపారు.