6 July, 2026 | 7:41 PM

పోడు సాగుదారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

06-07-2026 07:10 PM

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య డిమాండ్

ములకలపల్లి,(విజయక్రాంతి): పోడుభూముల సమస్యలపై ఈ నెల 13న భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు జరిగే ధర్నా ను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు‌.

పోడు సాగుదారుల నుండి పోడు భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల నిర్భంధం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు పోడు సాగుదారుల పై నిర్భంధం ఆపకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. పోడు సాగుదారుల పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాకపోతే దశల వారీగా ఉద్యమాలకు కార్యచరణ రూపొందిస్తామని హెచ్చరించారు.