నిర్మల్ కవికి సాహితీ పురస్కారం
06-07-2026 07:04 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి సాహితీవేత్త బి .వెంకట్ అక్షర రత్న సాహితీ పురస్కారం అందుకున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సాహిత్య రంగంలో చేస్తున్న కృషిగాను ఈ పురస్కారాన్ని అందుకున్నట్టు తెలిపారు. కత్తి మండప ప్రతాప్ కుమార్ ఐశ్వర్య నాగభూషణం పార్థసారథి శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారం అందుకున్న కవికి నిర్మల్ కవులు కళాకారులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.






