ట్యాంక్ బండ్‌పై ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టిన యువకులు
09-08-2024 01:14 PM
హైదరాబాద్: ఇద్దరు యువకులు టీఎస్ ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేసిన సంఘటన హైదరాబాద్ నగరం ట్యాంక్ బండ్ పై చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బస్సు ఆపడంతో బైకుపై వస్తున్న యువకులు బస్సులు ఢీకొట్టారు. దీంతో ఆగ్రహించిన ఇద్దరు యువకులు బస్సులు అద్దాలు పగలగొట్టారు. డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.






