calender_icon.png 10 December, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీషీటర్ల బైండోవర్

08-12-2025 12:28:30 AM

మహబూబాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి):పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భయం లేకుండా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో 19 మంది రౌడీషీటర్లను మహబూబాబాద్ తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలనే షరతులతో వారి నుండి షూరిటీ తీసుకుని తహసిల్దార్ సెల్ఫ్ షూరిటీపై విడుదల చేశారు.