08-12-2025 12:27:13 AM
మహబూబాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఏకశిలా పదునెట్టాంబడి కలిగిన దేవాలయంగా గుర్తింపు పొందిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయ ఆధ్వర్యంలో ఆదివారం పంబారట్టు వేడుకను కన్నుల పండుగ నిర్వహించారు. ధర్మశాస్త దేవాలయం నుండి ఉదయం 7:30 గంటలకు అయ్యప్ప విగ్రహ శోభాయాత్ర ప్రారంభించారు.
కేసముద్రం పట్టణ పురవీధుల గుండా శోభాయాత్ర కు అడుగడుగున ప్రజలు నీరాజనం పలికారు. అయ్య ప్ప మాలధారులు, అయ్యప్ప భక్తులు ఆటపాటలతో ఊరేగింపు నిర్వహించారు. అనం తరం పెద్ద చెరువు వద్దకు ఊరేగింపు చేరుకున్న తర్వాత స్వామికి జల క్రీడలు, అభిషేకాలు నిర్వహించారు.